రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్

రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్

కర్నూలు: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఇవాళ జిల్లాలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరప్రవృత్తిని విడిచి సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.