మార్కులు తక్కువగా రావడంతో.. విద్యార్థి ఏంచేసిందంటే.!
AKP: అనకాపల్లిలోని ఓ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపానికి గురై బుధవారం సాయంత్రం హాస్టల్ గదిలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్నేహితులు గమనించి సిబ్బంది, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.