మడకశిరలో సినీనటుల అవగాహన ర్యాలీ
సత్యసాయి: యువత భవిష్యత్తు, ప్రాణరక్షణే ప్రభుత్వ ప్రాధాన్యతని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. మడకశిరలో "డ్రగ్స్ వద్దు - హెల్మెట్ ముద్దు" నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్, సినీ తారలు శ్రీవిష్ణు, హెబ్బా పటేల్ పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకపోతే కుటుంబాలు రోడ్డున పడతాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.