మంచినీటి సమస్యను పరిష్కరించాలని వినతి

BDK: కొత్తగూడెం మున్సిపాలిటీలో కిన్నెరసాని మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం సీపీఎం ఆధ్వర్యంలో.. నాయకులు మున్సిపల్ కమిషనర్ సుజాతకు వినతి పత్రాన్ని అందించారు. గత 15 రోజులుగా మంచినీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు. దీనిపై స్పందించి సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు.