కంటైనర్‌లో అక్రమంగా గోవుల తరలింపు
RR: అక్రమంగా గోవులను తరలిస్తున్న 2 కంటైనర్‌లను హిందూ వాహిని, భజరంగ్దళ్ సభ్యులు నిన్న రాత్రి పట్టుకున్నారు. షాద్‌నగర్ కూడలిలో మూడు కంటైనర్లు అనుమానాస్పదంగా కనిపించడంతో కంటైనర్ డ్రైర్లను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఆపకుండా అతివేగంగా వెళ్లారు. దీంతో భజరంగ్దళ్ సభ్యులు వారిని వెంబడించి 2 కంటైనర్‌లోని 48 ఆవులను షాద్ నగర్ మున్సిపాలిటీలోని చౌడమ్మ గుట్ట గోషాలకు తరలించారు.