గ్యాస్ మాఫియా గుట్టురట్టు చేసిన అధికారులు
HYD: రాష్ట్రంలో గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు గ్యాస్ మాఫియాగా మారుతున్నారు. రాజేంద్రనగర్ పరిధిలో గృహ అవసరాలకు వాడే సిలిండర్లను అక్రమంగా కమర్షియల్ వినియోగానికి మళ్లిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో బండ్లగూడ జాగీర్‌లో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి ఈ గ్యాస్ మాఫియా గుట్టును రట్టు చేసి కేసులు నమోదు చేశారు.