కోట బొమ్మాలిలో మహిళ దారుణ హత్య

SKLM: కోటబొమ్మాళి మండలం పెద్ద హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన దుంపల దాలమ్మ(65) మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటి పెరటి నుంచి దుండగులు చోరబడ్డారు. అనంతరం ఆమె మెడలోని బంగారం గొలుసు చోరీ చేసి, హతమార్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.