కోతకు గురై ఏడాది.. మరమ్మతుల దారేది?

కోతకు గురై ఏడాది.. మరమ్మతుల దారేది?

ADB: ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాలలో గతేడాది కురిసిన వర్షాలకు వాగులు పొంగడంతో తారు రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. దెబ్బతిన్న రోడ్లపై ఏజెన్సీ మండలాలకు చెందిన గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసి రహదారులు కొట్టుకుపోతే వానాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో బయటకు ఎలా వెళ్ళడం అని వాపోతున్నారు.