VIDEO: మద్ది అంజన్న హుండీ ఆదాయం లెక్కింపు
ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి హుండి ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 106 రోజులకు గాను రూ. 63,24,455 ఆదాయంగా సమకూరినట్లు ఆలయ ఈవో చందన తెలిపారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి, దేవదాయ ధర్మదాయ శాఖ, ఏలూరు వారి పర్యవేక్షణలో, పోలీస్ రెవిన్యూ అధికారుల సమక్షములో కే.వీ.బీ. బ్యాంక్ సిబ్బంది సమక్షంలో ఈ లెక్కింపు జరిగిందన్నారు.