'రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలు జరపాలి'

'రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలు జరపాలి'

MNCL: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే పరిషత్, పురపాలక ఎన్నికలు నిర్వహించాలని బీసీ కులాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు మంచర్ల సదానందం డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల్లో చైతన్యం కారణంగానే రెండు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50 శాతానికి పైగా బీసీలు సర్పంచులుగా ఎన్నికయ్యారని తెలిపారు.