ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు వన భోజనాలు
ADB: విద్యార్థులు ప్రకృతి ఆస్వాదించి ఉత్సాహంగా గడపాలనే ఉదేశ్యంతో వన భోజనాల కార్యక్రమం నిర్వహించినట్లు కప్పర్ల ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం తాంసి మండలంలోని కప్పర్ల ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులకు స్థానిక పల్లె ప్రకృతి వనంలో వన భోజన కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతితో మమేకమై భోజనాలు చేసి ఆట పాటలతో గడిపారు.