'పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు'

కర్నులు: బనగానపల్లె మండలం పలుకూరులోని బైబిల్ మిషన్ చర్చిలో జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో చర్చి ఫాదర్ రాజు సహకారంతో చెట్టు విశిష్టతకు సంబంధించిన కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని, చెట్లను నరికివేయడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటోదని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలన్నారు.