10 మంది అధికారులకు మెమోలు
VSP: వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన 10 మంది అధికారులకు మెమోలు జారీ చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.