నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: పొందూరు సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ వి.సుధీర్ తెలిపారు. సబ్ స్టేషన్ మెయింటినెన్స్ పనులు కారణంగా పొందూరు టౌన్ ఫీడర్, కృష్ణాపురం ఫీడర్ పరిధిలోని పొందూరు పంచాయతీ రాపాక కొంచాడ మలకాం పంచాయతీల పరిధిలో గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు నిలిపివేయడం జరుగుతోందని తెలిపారు.