రాతి మసీదులో జరిగిన అన్నదాన కార్యక్రమం
CTR: మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలని ముస్లిం మత పెద్దలు అన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలోని రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు.