రోడ్ల కోసం కేంద్ర మంత్రికి వినతి

PLD: పల్నాడులో ప్రధాన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కలిసి విన్నవించారు. కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలని కోరారు. చిలకలూరిపేట-నెకరికల్లు జాతీయ రహదారి ప్రాజెక్టుకు ఇంకా అనుమతులు రాలేదని తెలిపారు. నరసరావుపేట బైపాస్ భూసేకరణపై హైకోర్టు స్టే ఇచ్చిందని పేర్కొన్నారు.