భారత్‌పై పాక్ క్రికెట్ దిగ్గజం ప్రశంసలు
T20 WC విజయం నేపథ్యంలో టీమిండియాపై పాక్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియా పాలసీ, సిస్టం గెలిచాయని.. కోచ్ గంభీర్ మెరిట్ ఆధారంగా ఆటగాళ్ల ఎంపిక చేశాడని కొనియాడారు. సంజూ కోసం అందరితో పోరాడాడని పేర్కొన్నారు. యువ ఆటగాళ్లతో ట్రోఫీ గెలిచారని, WC విన్నింగ్ కెప్టెన్లను గౌరవించారని ప్రశంసించారు. అందరిలో యూనిటీ కనిపించిందన్నారు.