రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
జగిత్యాల రూరల్ మండలంలోని చలిగల్ గ్రామంలో 11 కేవీ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు కరెంటు ఉండదని చలిగల్ అసిస్టెంట్ ఇంజనీర్ దొంతి శ్రీధర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. దీనివలన చలిగల్ గ్రామంలోని అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అంతరాయం కలుగుతుందని అన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.