'జిల్లాలో మహిళలకు రక్షణ కరువైంది'

'జిల్లాలో మహిళలకు రక్షణ కరువైంది'

ASF: జిల్లాలో ఆదివాసీ మహిళల రక్షణ కరువైందని పర్దాన్ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వందన ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఇవాళ జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. పెళ్లి, ఉపాధి సాకుతో దళారులు అమాయక మహిళలను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ అక్రమ రవాణా పెరుగుతోందని విమర్శించారు.