రెడీ-టు-ఈట్ ఆహారం వైపు జనం మొగ్గు
ప్రస్తుత యుద్ధ పరిస్థితులు ప్యాకేజ్డ్ ఫుడ్ రంగానికి ఊతమిస్తున్నాయి. యుద్ధం కారణంగా LPG సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో, ప్రజలు వంట వండుకునే కంటే ప్యాకేజ్డ్ ఫుడ్ కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు. దీని ప్రభావంతో ప్రముఖ ఈ-కామర్స్ వేదికల్లో ప్యాకేజ్డ్ ఫుడ్ విక్రయాలు ఒక్కసారిగా 20 శాతం మేర పెరిగాయి. ఇన్స్టంట్ ఫుడ్, రెడీ-టు-ఈట్ ప్యాకెట్లకు మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఏర్పడుతోంది.