రేపే వెలుగొండ జలాల సాధన సదస్సు

రేపే వెలుగొండ జలాల సాధన సదస్సు

ప్రకాశం: కనిగిరిలోని డాక్టర్ గురుబ్రహ్మం యోగా మందిరం వద్ద శనివారం వెలుగొండ జలాల సాధన సదస్సు జరుగుతుందని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జనవిజ్ఞాన రాష్ట్ర అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ రావు హాజరవుతున్నారు. కావున మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు.