విద్యార్థులకు ఉచితంగా నీట్ శిక్షణ
SKLM: జిల్లాలో ప్రభుత్వం ఉచితంగా నీట్ శిక్షణ అందించనుందని ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమ న్వయకర్త యశోదలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 75692 26400, 94412 67323 ను సంప్రదించాలన్నారు.