'కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు'

TPT: ఏర్పేడు మండల పరిధిలోని మర్రి మంద పంచాయతీలో గల లక్ష్మీ హయగ్రీవ స్వామివారి ఆలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్ట, మహా కుంభాభిషేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ముందుగా వారికి ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుంభాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.