VIDEO: ప్రశాంతంగా 'పది' పరీక్షలు ప్రారంభం: డీఈవో
SRPT: జిల్లావ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 69 కేంద్రాల్లో 12,403 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు డీఈవో అశోక్ వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.