ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

SKLM: ఆసుపత్రిలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అయ్యాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శుక్రవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆయన సందర్శించి సమీక్షించారు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిపై చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు.. ఆ సమస్యలు పరిశీలనకు సందర్శించగా ఆ సమస్యలు ప్రస్తుతం పరిష్కారం అయినట్లు చెప్పారు.