'సఖి సురక్ష మెడికల్ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోండి'

'సఖి సురక్ష మెడికల్ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోండి'

నెల్లూరు సిటీ పరిధిలోని కపాడిపాలెం అర్బన్ హెల్త్ సెంటర్‌లో మంగళవారం సఖి సురక్ష స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమీషనర్ వై.వో నందన్, పీడీ బీ. లీలా రాణి హాజరైనారు. మహిళల ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశ్యంతో థైరాయిడ్, షుగర్, విటమిన్ లోపం, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, వంటి 16 రకాల టెస్టులు చేస్తున్నారని తెలిపారు.