'సత్తుపల్లి అభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులు'
KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్లు నిధులు మంజూరైనట్లు మున్సిపల్ కమిషనర్ కొండ్రా నరసింహ తెలిపారు. ఇందులో రూ. 2 కోట్లతో ఇండోర్, రూ.3 కోట్లతో అవుటోడోర్ స్టేడియాలు నిర్మిస్తామన్నారు. మిగిలిన రూ.10 కోట్లతో 23 వార్డుల్లో డ్రైనేజీలు, సీసీ, బీటీ రోడ్లు నిర్మించి, ప్రజల అవసరాల మేరకు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.