మామపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు

మామపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు

JGL: కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ఏరియాలో BRS పార్టీ ఫ్లెక్సీని చింపడంపై మామ ఖలీమ్ ఖాన్, అల్లుడు నఫి మధ్య తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. మామ తనను బెదిరించడంతో ఆగ్రహించిన అల్లుడు నఫి, మామ ఖలీమ్ ఖాన్‌ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన మామను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.