రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి

NRPT: మక్తల్ మండలం సంగంబండ గ్రామ శివారులోని బీరప్ప ఆలయం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బాలిక అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. దాసరపల్లి వాసులు ఆలయ మఠం వద్ద నివసిస్తుండగా, రాత్రి రోడ్డుపై నడుస్తున్న కృష్ణవేణిని బొలెరో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమాచారం అందుకున్న మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.