VIDEO: సైనిక్ స్కూల్ ప్రారంభంపై కేంద్రమంత్రితో చర్చ

WGL: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, ఇతర ఎంపీలు బుధవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. వరంగల్‌లో సైనిక్ స్కూల్‌ను త్వరితగతిన ప్రారంభించాలని చర్చించారు. సైనిక్ స్కూల్ ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దబడతారని, వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని ఎంపీ కావ్య పేర్కొన్నారు.