శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రికి ఆహ్వానం
నెల్లూరు నగరంలోని క్యాంప్ కార్యాలయంలో పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణను గుర్రం జాషువా గ్రంథాలయ వర్కింగ్ ప్రెసిడెంట్ యస్. కే. ఖాసిం, సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 9 గంటలకు మద్రాస్ బస్టాండ్‌లోని పద్మ భూషణ్ గుర్రం జాషువా గ్రంథాలయ భవన పునర్నిర్మాణ శంకుస్థాపనకు రావాలని మంత్రికి ఆహ్వానం పలికారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.