లింగ నిర్ధారణ, ఎంపికపై కఠిన చర్యలు: సీపీ

లింగ నిర్ధారణ, ఎంపికపై కఠిన చర్యలు: సీపీ

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ చర్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్‌తో పనిచేయాలని, నిబంధనలను పాటించాలని ఆయన ఆదేశించారు.