'పదేళ్ల పాలల్లో ఒక రైతు కూడా క్యూలైన్లో నిలబడలేదు'

ADB: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రైతు కూడా యూరియా కోసం క్యూ లైన్లో నిలబడలేదని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం రూరల్ మండలంలోని చాందటి గ్రామంలో వరదల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఎటువంటి ఉపకారం లేకపోగా కనీసం ఇటువంటి విపత్కర పరిస్థితిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.