ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం మంగళవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని రికార్డులను పరిశీలించి విద్యార్థుల హాజరు, బోధన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా పాఠశాలలు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.