ఎరువుల దుకాణం తనిఖీ చేసిన కలెక్టర్

ఎరువుల దుకాణం తనిఖీ చేసిన  కలెక్టర్

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఫర్టిలైజర్ షాప్‌లో సరైన రికార్డులు లేకపోవడంపై కలెక్టర్ సదరు యజమానికి మందలించారు. దుకాణంలో ఎరువులు, పెస్టిసైడ్ , స్టాక్ వివరాలు, లావాదేవీలు రికార్డులు సక్రమంగా మెయింటినెన్స్ చేయాలని ఆమె సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ ఉన్నారు.