VIDEO: ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
హన్మకొండ నగరంలో డీసీసీబీ మీటింగ్ హాల్‌లో జరిగిన ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. కోటి మహిళలను కోటీశ్వరులను చేయడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యమైన చీరల పంపిణీతో పాటు మహిళల ఆర్థిక సాధికారతకు పలు పథకాలు అమలులో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.