VIDEO: పూర్తిగా గుంతలమయంగా మారిన ఇందాని రహదారి
ASF: వాంకిడి మండల కేంద్రం నుంచి సరండి, ఇందాని వైపు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. BT రోడ్డు దుస్థితి కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతుల కోసం అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరారు