కార్యకర్త కుటుంబానికి అండగా జనసేన పార్టీ
AP: జనసేన పార్టీ తన కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచింది. జనసేన పార్టీ క్రియశీలక సభ్యుడు రూపనాయక్ గత కొంత కాలం కిందట విద్యుత్ ప్రమాదంలో మరణించాడు. ఇతని స్వస్థలం ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి. అయితే చనిపోయిన రూపనాయక్ కుటుంబానికి కొణిదెల నాగబాబు రూ.5లక్షల చెక్కును అందజేశారు. కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.