నెల్లిమర్లలో పోషణ పక్వాడ కార్యక్రమం

నెల్లిమర్లలో పోషణ పక్వాడ కార్యక్రమం

VZM: నెల్లిమర్లలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పోషణపై అవగాహన కల్పించారు. పిల్లలకు సెల్‌ఫోన్ ఇవ్వొద్దని, జంక్ ఫుడ్ దూరంగా ఉంచాలని సూచించారు. అలాగే, తల్లి పాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం పద్మ, సూపర్వైజర్ శారద పాల్గొన్నారు.