నేడు అమ్రాబాద్‌లో ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటన
NGKL: అమ్రాబాద్ మండలంలో నేడు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటించనున్నారు. అమ్రాబాద్ మండలంలోని తెలుగుపల్లి గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా శంకుస్థాపన చేస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అనంతరం రైతు కమిషన్ అవగాహన సమావేశంలో, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.