గుంతకల్లులో ఘనంగా వీర హనుమాన్ భారీ ర్యాలీ
ATP: గుంతకల్లు బజరంగ్దల్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం వీర హనుమాన్ భారీ విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీరప్ప సర్కిల్ నుంచి కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్వాములు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.