గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో యువకుడు హత్య

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్‌లో రహదారిపై నిద్రిస్తున్న తూళ్ల ప్రభాకర్ (35) అనే యువకుడిని సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది హత్య చేశారు. స్థానిక సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రైమ్ సిబ్బంది, క్లూస్ టీమ్ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.