వ్యాపారవేత్తను తయారు చేసేలా కృషి చేయాలి: కలెక్టర్

వ్యాపారవేత్తను తయారు చేసేలా కృషి చేయాలి: కలెక్టర్

NTR: ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తయారు చేసేందుకు కృషి చేయాలని, వచ్చే జూన్ నెల మొదటి వారంలో కొత్త రుణాలతో పెద్ద ఎత్తున యూనిట్లు నెలకొల్పుటకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మచిలీపట్నంలో జీవనోపాధుల కార్యాచరణ ప్రణాళికపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.