అన్నవరం ఆలయ EOపై ఉన్నతాధికారుల ఆగ్రహం
AP: నెయ్యి కొనుగోళ్ల విషయంలో అన్నవరం ఆలయ EOపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో టెండర్ల ద్వారా నెయ్యి కొనుగోలు చేయాలని గతంలోనే ఆదేశించినా.. కొటేషన్ పద్ధతిలో డెయిరీల నుంచి కిలో నెయ్యి రూ.590కి తీసుకుంటున్నాడని వారి దృష్టికి వచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని EOను ఆదేశించారు.