VIDEO: కొమరవెల్లి మల్లన్న పల్లకిని దర్శించుకున్న భక్తులు
ADB: తాంసి మండలంలోని బండలనాగపూర్ గ్రామానికి వచ్చిన కొమరవెల్లి మల్లన్న పల్లకీని గ్రామస్తులు శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం పల్లకికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఆశీర్వాదాలు స్వీకరించారు. నియమ నిష్ఠలతో కొమరవెల్లి మల్లన్న పల్లకీని గ్రామాల్లో ఊరేగించటం గొప్ప విషయమని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, మహిళలు తదితరులున్నారు.