రాజమండ్రి సిటీలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం
E.G: రాజమండ్రి నగరంలో బ్లేడ్ బ్యాచ్ మరోసారి వీరంగం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఓ మ్యారేజ్ బ్యూరో కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర రక్త గాయాలు అయ్యాయి. ఇటీవలి కాలంలో నగరంలో పేకాట క్లబ్బులు, నకిలీ మద్యం, డ్రగ్స్ కార్యకలాపాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.