అర్జీలు స్వీకరించిన రూపానందరెడ్డి

అన్నమయ్య: రైల్వే కోడూరు మండలంలోని రాఘవరాజు పురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రైల్వే కోడూరు టీడీపీ బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు.