చెల్లని చెక్కు కేసులో రెండేళ్లు జైలు శిక్ష
ప్రకాశం: ఒంగోలు కోర్టు చెల్లని చెక్కు కేసులో నిందితుడు సుధాకర్ రావుకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.8.60 లక్షల జరిమానా విధించింది. సుధాకర్ రావు, ఆనందరావు వద్ద దశలవారీగా రూ.8 లక్షలు అప్పు తీసుకుని, బాకీ చెల్లించే క్రమంలో చెల్లని చెక్కులు ఇచ్చాడు. ఖాతాలో తగినంత మొత్తం లేకపోవడంతో చెక్కు చెల్లుబాటు కాలేదు. బాధితుడు కోర్టును ఆశ్రయించగా, విచారించిన కోర్టు సుధాకర్‌కు విధించింది.