యువతలో పెరుగుతున్న రక్తపోటు సమస్యలు

యువతలో పెరుగుతున్న రక్తపోటు సమస్యలు

యువతలో అధిక రక్తపోటు కేసులు పెరుగుతున్నాయి. BP తరచుగా 140/90 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే రక్తపోటు అంటారు. ప్రారంభంలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. కానీ, ఆ తర్వాత దశల్లో తలనొప్పి, తలతిరగడం, అలసట, శ్వాస ఆడకపోవడం, ఛాతీలో భారం తదితర లక్షణాలు కనిపించవచ్చు. దీన్ని సకాలంలో గుర్తించకపోతే గుండె, మూత్రపిండాలు, మెదడుపై తీవ్ర ప్రభావాలను చూపుతుంది. అందువల్ల యువత శ్రద్ధ తీసుకుంటే మంచిది.