VIDEO: దేవాపూర్-ఝరి మార్గంలో గుంతల గండం..!
ADB: తలమడుగు మండలం దేవాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి ఝరి గ్రామం వరకు ప్రధాన రహదారి భారీ గుంతలతో అధ్వానంగా మారింది. ఈ మార్గంలో నిత్యం దేవాపూర్, పల్లి (కె, బి), బరంపూర్, అర్లి (కె), ఝరి గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డుపై అడుగడుగునా ఏర్పడిన గుంతల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.